Home » Air force
తెలంగాణలో ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని విద్యార్థులకు ఏవియేషన్ రంగంలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, అత్యుత్తమ శిక్షణ కల్పించే లక్ష్యంతో సాంకేతిక విద్యాశాఖ మరొక కీలక అడుగు వేసింది.
భారత రక్షణ దళాల ఆధునీకరణ కోసం, దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1.10 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది.
భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు.
స్వదేశీ యుద్ధవిమానం తేజస్ ఎంకే-2పై భారత వైమానిక దళం మాజీ ఉపాధ్యక్షుడు ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ చేసి రెండు నెలలు కూడా కాకముందే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రక్షణ రంగంలో చర్చకు దారితీశాయి.
భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీగా విమానాలను కొనుగోలు చేయనుంది. 60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది.
పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్‌ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి పాక్ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.