Indian Air Force: గూస్‌బమ్స్ వీడియో విడుదల చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
ABN , Publish Date - May 20 , 2025 | 08:02 PM
Indian Air Force: పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లను మన ఎయిర్ ఫోర్స్ దళాలు నాశనం చేశాయి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించాయి. పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా సాయంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది.

ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవ్వటంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మే 7వ తేదీన పాకిస్థాన్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యమైన విషయాన్ని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుసాధ్యం చేసింది. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి పడేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేసింది. ఏకంగా 100 మంది ఉగ్రవాదులు ఎయిర్ ఫోర్స్ దాడుల్లో చనిపోయారు.
రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలోనూ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లను మన ఎయిర్ ఫోర్స్ దళాలు నాశనం చేశాయి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా సాయంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. యుద్ధానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన తమ దళం వీడియోను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన ఆ వీడియో గూస్‌బమ్స్ తెప్పిస్తోంది.
ఆ వీడియోలో ఎయిర్ ఫోర్స్ వీరోచిత విన్యాసాలు ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాల్ సినిమాలోని ‘ అరంబ్ హై ప్రచండ్’ పాట ప్లే అవుతూ ఉంది. వీడియో చూస్తూ.. ఆడియో వింటుంటే .. రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: మాయ లేడీలు.. పెళ్లి చేస్తానంటే నమ్మాడు.. పెళ్లి రోజు ఊహించని షాక్..
Bullet Train: సరికొత్త టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం..