Share News

Bullet Train: సరికొత్త టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం..

ABN , Publish Date - May 20 , 2025 | 05:38 PM

Bullet Train Project: ది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవుతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇందులో 300 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం తాజాగా పూర్తయింది.

Bullet Train: సరికొత్త టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం..
Bullet Train

ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు జెట్ స్పీడుతో సాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి 300 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో బ్రిడ్జి పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 300 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ఈ బ్రిడ్జిని ఫుల్ స్పాన్ లాంచింగ్ పద్దతి ద్వారా నిర్మించినట్లు తెలిపారు.


కాగా, ది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవుతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇందులో 300 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం తాజాగా పూర్తయింది. ఈ 300 కిలోమీటర్ల బ్రిడ్జిలో.. 257.4 కిలోమీటర్లు ఫుల్ స్పాన్ లాంచింగ్ పద్దతి ద్వారా నిర్మించారు. ఈ పద్దతి సాధారణ పద్దతి కంటే పది రెట్లు వేగంగా పనుల్ని పూర్తి చేస్తుంది. ఈ పద్దతి ఉపయోగించి బ్రిడ్జిని నిర్మించటం ఇండియాలో ఇదే మొదటి సారి. ఇక, కేంద్ర మంత్రి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది.


లక్ష కోట్లతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. మొత్తం 1.08 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ వాటాగా పది వేల కోట్లను NHSRCLకు ఇవ్వనుంది. గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు 5 వేల కోట్ల చొప్పున NHSRCLకు ఇవ్వనున్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు మొత్తం 12 స్టేషన్లు ఉండనున్నాయి. వాటిలో 9 గుజరాత్‌లో మరో 3 మహారాష్ట్రలో ఉంటాయి. గత నెలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిష్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. 2028 చివరకు ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 06:05 PM