Share News

IAF: కరాచీకి సమీపంలో.. అరేబియా సముద్రంపై ఐఏఎఫ్ సైనిక విన్యాసాలు

ABN , Publish Date - Dec 05 , 2025 | 09:44 PM

రక్షణ, వాణిజ్య మార్గాలకు కీలకమైన తీరప్రాంతమైన అరేబియన్ సముద్రంపై ఐఏఎఫ్ తమ ఆపరేషన్ సన్నద్ధత, ఏరియల్ సామర్థ్యాలను ప్రదేశించే లక్షంగా ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

IAF: కరాచీకి సమీపంలో.. అరేబియా సముద్రంపై ఐఏఎఫ్ సైనిక విన్యాసాలు
IAF drills in Arabian sea

న్యూఢిల్లీ: భారత వైమానికి దళం (IAF) అరేబియా సముద్రంపై డిసెంబర్ 10, 11 తేదీల్లో సైనిక విన్యాసాలు నిర్వహించనుంది. పాకిస్థాన్‌లోని కరాచీకి సుమారు 200 నాటికల్ మైళ్ల దూరంలో, పాకిస్థాన్ కంట్రోల్‌లోని గగనతలానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ విన్యాసాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఐఏఎఫ్ శుక్రవారంనాడు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.


రక్షణ, వాణిజ్య మార్గాలకు కీలకమైన తీరప్రాంతమైన అరేబియన్ సముద్రంపై ఐఏఎఫ్ తమ ఆపరేషన్ సన్నద్ధత, ఏరియల్ సామర్థ్యాలను ప్రదేశించే లక్షంగా ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సహజంగా ఈ విన్యాసాల్లో ఆధునిక విమానాలను, వ్యూహాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఎప్పుడైనా సిద్ధంగా ఉండటానికి వైమానిక దళాలకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి.


ఇవి కూడా చదవండి..

రాహుల్, ఖర్గేను కాదని.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం

ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 09:50 PM