Shashi Tharoor: రాహుల్, ఖర్గేను కాదని.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం
ABN , Publish Date - Dec 05 , 2025 | 07:23 PM
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
న్యూఢిల్లీ: రెండ్రోజుల భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కానీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి కానీ ఆహ్వానం దక్కలేదు. అయితే ఇందుకు భిన్నంగా ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు మాత్రం ఆహ్వానం లభించింది. పార్టీ లైన్స్‌కు భిన్నంగా శశిథరూర్ ఇటీవల బీజేపీకి దగ్గరవుతున్నారంటూ కాంగ్రెస్ వర్గాల్లో విమర్శలు వెలువడుతున్న క్రమంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
పుతిన్‌కు రాష్ట్రపతి ఇస్తున్న విందుకోసం ఖర్గే, రాహుల్‌కు అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై శశిథరూర్ స్పందిస్తూ, తనకు అందిన ఆహ్వానాన్ని గౌరవిస్తానని, ఏ ప్రాతిపదికపై విపక్ష నేతను ఆహ్వానించలేదో తనకు తెలియదని అన్నారు.
కాగా, శశిథరూర్‌కు దౌత్య వవహరాల్లో అనుభవం ఉన్నందున ఆయనను ఆహ్వానితుల జాబితాలో చేర్చి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే శశిథరూర్ గతంలో ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించడం, రష్యా అధికారులతో అనుబంధం కారణంగా ఆయనను విందుకు ఆహ్వానించి ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాలకు బ్రీఫింగ్ ఇచ్చేందుకు వెళ్లిన ఎంపీల బృందంలో థరూర్ కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నచ్చిన వాచీలు పెట్టుకుంటాం.. శాంటోస్ డి కార్టియర్ వాచ్‌పై డీకే క్లారిటీ
ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి