Share News

PM Modi: రష్యా టూరిస్టులకు ఉచిత ఈ-వీసా.. పుతిన్‌తో సంయుక్త సమావేశంలో మోదీ

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:12 PM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

PM Modi: రష్యా టూరిస్టులకు ఉచిత ఈ-వీసా.. పుతిన్‌తో సంయుక్త సమావేశంలో మోదీ
Free E-Visas to Russian Tourists

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ప్రకటన చేశారు. రష్యా పర్యాటకులకు ఉచిత 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఉచిత 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇందుకు ఎలాంటి రుసుము ఉండదని చెప్పారు.


'త్వరలోనే రష్యా పౌరులకు 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి రుసుము లేకుండానే ఈ వీసాలను ప్రోసెస్ చేస్తాం' అని ప్రధాని ప్రకటించారు.


విజన్ 2030 డాక్యుమెంట్‌పై సంతకాలు

ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు విజన్ 2030 డాక్యుమెంట్‌పై భారత్-రష్యా సంతకాలు చేసినట్టు మోదీ తెలిపారు. ఇందువల్ల ఇరుదేశాల్లో మరిన్ని వాణిజ్య సముదాయాలు తెరుచుకుంటాయని అన్నారు. ఈరోజు జరిగే ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంలో కూడా తామిరువురూ పాల్గొంటున్నామని, రెండుదేశాల ఆర్థిక సంబంధాలను ఈ ఫోరం మరింత పటిష్టం చేస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

అమెరికాకు బిగ్ షాక్.. ఆ విషయంలో భారత్‌కు అండగా రష్యా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 04:47 PM