Indigo Crisis Techie Couple: ఇండిగో ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లో టెకీ దంపతుల రిసెప్షన్
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:48 PM
బెంగళూరుకు చెందిన మేథా క్షీరసాగర్ వివాహం నవంబర్ 23న ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్‌తో జరిగింది. ఇరువురూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
బెంగళూరు: ఇండిగో విమాన సర్వీసులు రద్దుకావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తమ ట్రావెల్ ప్లాన్స్‌లో మార్పులు చేసుకోక తప్పడం లేదు. డిసెంబర్ 2న ఇండిగో విమానం రద్దు కావడంతో కొత్తగా పెళ్లయిన ఓ టెక్కీ దంపతులు తమ ప్లాన్‌లో మార్పు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లోనో రెసెప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బెంగళూరుకు చెందిన మేథా క్షీరసాగర్ వివాహం నవంబర్ 23న ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్‌తో జరిగింది. ఇరువురూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వధువు స్వస్థలమైన హుబ్లీలో ఆమె కుటుంబ సభ్యులు రెసెప్షన్‌కు ఏర్పాటు చేశారు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా వారి ప్లాన్స్ తలకిందులయ్యాయి. కొత్త దంపతులు డిసెంబర్ 2న భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం రద్దయింది. తొలుత విమానాన్ని డిసెంబర్ 3కు రీషెడ్యూల్ చేశారని, అయితే ఆ తర్వాత కూడా దాన్ని రద్దు చేశారని టెకీ జంట తెలిపారు. అయితే అప్పటికే రెసెప్షన్ ఏర్పాట్లు పూర్తికావడం, అతిథిలు హాజరవడంతో వర్చువల్‌గా ఇద్దరూ రెసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. రెసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన హాలులో స్క్రీన్ ఎరేంజ్ చేసి వధూవురులను చూపించారు.
కాగా, ఇండిగో శుక్రవారంనాడు కూడా 400కు పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిలిచిపోయారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా సర్వీసులు పునరుద్ధరణ జరుగుతుందని డీజీసీఏ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మేము తటస్థం కాదు.. శాంతి పక్షాన నిలిచాము: పుతిన్‌తో మోదీ స్పష్టీకరణ
వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి