Home » online
యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందుకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్సే కారణంగా తెలుస్తోంది.
ఆన్‌లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి...
ఒకప్పుడు డబ్బులకు కటకటలాడేవారు జనం.. ఇప్పుడు సేవలు పొందడానికి ‘ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తాం’ అంటున్నారు. కాలు కదపకుండా ఇంటికే తెప్పించేసుకుంటున్నారన్నీ!. అవి వైద్యసేవలు కావొచ్చు.. పెంపుడు జంతువుల సంరక్షణ కావొచ్చు.. సెలూన్ సేవలూ అవ్వొచ్చు.. ఏదైనా సరే! ఒక ‘యాప్’ సాయంతో ఇంటి ముంగిటకొస్తున్న రకరకాల సర్వీసుల ధోరణి బాగా విస్తరిస్తోంది..
దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్‌లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడినా.. ఆన్‌లైన్ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.
డబ్బులతో ముడిపడిన్ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించే కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. 'ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025' పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
సామాన్యులనే కాదు.. విద్యావంతులనూ బురిడీ కొట్టిస్తూ రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఫ్లాట్ అద్దె కావాలంటూ ఆర్మీ అధికారుల్లా మాట్లాడి నమ్మించిన కేటుగాళ్లు.. అద్దె అడ్వాన్స్ చెల్లిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.12.75 లక్షలు కాజేశారు.
ఆన్‌లైన్ గేమ్స్.. వీడియో గేమ్స్ ఆడే పిల్లలను తల్లిదండ్రులు ఇకపై ఓ కంట కనిపెట్టాల్సిందే. లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే.. డిజిటల్ గేమింగ్ ప్లాట్ ఫామ్స్‌ను రిక్రూట్‌మెంట్ అడ్డాగా మార్చుకుంటున్నాయి తీవ్రవాద బృందాలు. టీనేజర్లే లక్ష్యంగా.. చాట్ పేరిట మాటల గాలం వేసి తమవైపు లాక్కుంటున్నాయని తాజాగా బ్రిటిష్ పరిశోధకులు సంచలన నివేదిక విడుదల చేశారు.
ఆన్‌లైన్ జూదంలో నగలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదురై జిల్లాలో చోటుచేసుకుంది. సిల్లాంపట్టి ప్రాంతానికి చెందిన చిన్నరాజా (35) డైవింగ్ శిక్షణ సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. చిన్నరాజాకు రూపవతి అనే భార్య, ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు.
నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాలు కదపకుండా ఫోన్‌లో ఉండే ఈ-కామర్స్ యాప్స్ నుంచి నచ్చినవి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కస్టమర్లకు సౌలభ్యంతో పాటు కొన్నిసార్లు సమస్యలనూ తీసుకొస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసపోతే వెంటనే ఈ పని చేయండి.