Digital shopping habits: లక్ష రూపాయల కండోమ్స్.. ఆసక్తికరంగా ఇన్‌స్టామార్ట్ ఆర్డర్స్..
ABN , Publish Date - Dec 22 , 2025 | 07:24 PM
వీధుల్లో దొరికే చిన్న చిన్న వస్తువుల కోసం కూడా ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి వాటిని ఆశ్రయించే వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ విభాగం ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ షాపింగ్ జోరందుకుంది. ఓ మోస్తరు పట్టణాల్లో కూడా పలు ఈ-కామర్స్ సంస్థలు రకరకాల వస్తువులను ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. వీధుల్లో దొరికే చిన్న చిన్న వస్తువుల కోసం కూడా ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి వాటిని ఆశ్రయించే వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ విభాగం ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను వెల్లడించింది (Swiggy Instamart viral news).
ఈ నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్టంగా రూ.10 చెల్లించి ప్రింటవుట్‌లు తెప్పించుకోగా, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ కోసం రూ.4.3 లక్షలు చెల్లించాడట. అలాగే చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో పలు సార్లు కండోమ్‌ల కొనుగోలు కోసం ఏకంగా లక్ష రూపాయలు వెచ్చించాడట. అలాగే ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్ ద్వారా రూ.15.16 లక్షలు విలువైన బంగారాన్ని కొనుగోలు చేశాడట. టైర్-2 నగరాల్లో కూడా ఇన్‌స్టామార్ట్ వ్యాపారంలో భారీ వృద్ధి నమోదైందట (Chennai man condoms purchase).
ఇక, ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన వస్తువుల జాబితాలో కరివేపాకు మొదటి స్థానంలో ఉందట (online grocery trends). కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాదిలో అత్యధికంగా 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ చేశాడట. కరివేపాకు తర్వాత స్థానాల్లో పెరుగు, గుడ్లు, పాలు, అరటిపళ్లు ఉన్నాయని ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదిక తెలిపింది. కాగా, రోజులో ఉదయం 7 నుంచి 11 గంటల మధ్యలో, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్యలో ఎక్కువ ఆర్డర్లు వచ్చాడట.
ఇవి కూడా చదవండి..
అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..
కూతురిని ఇంట్లో ఉంచి బయటకెళ్లిన తండ్రి.. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..