Shocking incident: కూతురిని ఇంట్లో ఉంచి బయటకెళ్లిన తండ్రి.. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:40 PM
చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కింగ్‌డావో నగరంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని ఇంట్లో వదిలి బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చి కూతురు చేసిన పని చూసి అవాక్కయ్యాడు. కూతురిని ఇంటి దగ్గరే వదిలి ఎంత తప్పు చేశాడో అర్థం చేసుకుని కుమిలిపోతున్నాడు.
చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని ఇంటి దగ్గర వదిలి బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చి కూతురు చేసిన పని చూసి అవాక్కయ్యాడు. కూతురిని ఇంటి దగ్గరే వదిలి ఎంత తప్పు చేశాడో అర్థం చేసుకుని కుమిలిపోతున్నాడు. కూతురిని ఇంటి దగ్గర వదిలి వెళ్లడం వల్ల అతడికి ఏకంగా 6.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (father leaves daughter alone).
చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కింగ్‌డావో నగరంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని ఇంట్లో వదిలి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికకు 500 యువాన్ల నోట్ల కట్ట, ఓ కత్తెర కనిపించాయి. దీంతో ఆ బాలిక తన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 500 యువాన్ల నోట్ల నుంచి చైనా వ్యవస్థాపకుడు అయిన మావో జెడాంగ్ ఫొటోలను కట్ చేసింది. కొన్ని గంటల్లోనే, మొత్తం 50,000 యువాన్ (సుమారు రూ. 6.3 లక్షలు) నోట్లు ముక్కలుగా మారిపోయాయి (parenting mistake viral story).
తండ్రి ఇంటికి తిరిగి వచ్చి కూతురు చేసిన పని చూసి నివ్వెరపోయాడు (Girl cuts currency notes). ఇంటి నిండా చిరిగిన నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మావో జెడాంగ్ ఫొటోలు వివిధ వరుసలలో అమర్చి ఉన్నాయి. తండ్రి ఆ నోట్లను తిరిగి కలపడానికి గంటల తరబడి ప్రయత్నించాడు. కానీ అవి చిన్న ముక్కలుగా ఉండటం వల్ల అసాధ్యం అయింది. చైనాలో, కొద్దిగా చిరిగిన నోట్లను బ్యాంకులలో మార్చుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో, నోట్లు బాగా దెబ్బతిన్నాయి. బ్యాంకు పూర్తి మొత్తాన్ని తిరిగి ఇస్తుందో లేదో పూర్తి క్లారిటీ లేదు.
ఇవి కూడా చదవండి..
అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..
మీ కళ్లు షార్ప్ అయితే.. సముద్రం అడుగున ఉన్న నిధిని 15 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..