Boss gifts: అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:56 PM
చాలా కొన్ని సంస్థలు మాత్రమే ఉద్యోగుల పనితీరును ప్రశంసిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటాయి. తాజాగా ఒక కంపెనీ తన ఉద్యోగులలో కొంతమందికి ప్రోత్సాహకంగా కొత్త ఫ్లాట్‌లను ఇవ్వాలని నిర్ణయించుకుంది.
చాలా మంది ఉద్యోగులకు తాము పని చేసే కంపెనీ ఇచ్చే చిన్న చిన్న బహుమతులు కూడా ఎంతో సంతోషం కలిగిస్తాయి. యాజమాన్యం ఇచ్చే బోనస్‌లు, బహుమతులు ఉద్యోగుల పనితీరును మరింత పెంచుతాయి. చాలా కొన్ని సంస్థలు మాత్రమే ఉద్యోగుల పనితీరును ప్రశంసిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటాయి. తాజాగా ఒక కంపెనీ తన ఉద్యోగులలో కొంతమందికి ప్రోత్సాహకంగా కొత్త ఫ్లాట్‌లను ఇవ్వాలని నిర్ణయించుకుంది (company owner gifts flats).
జెజియాంగ్ గుషెంగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ కో. లిమిటెడ్ అనే చైనీస్ కంపెనీ ఆగ్నేయ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెంజౌలో ఉంది. కంపెనీ బాస్ తన ఉద్యోగులకు ప్రోత్సాహకంగా 18 ఫ్లాట్‌లను పంపిణీ చేయబోతున్నారు. తన కంపెనీలో ఐదు సంవత్సరాలకు పైగా పని చేస్తున్న ఉద్యోగులకు ఈ ఫ్లాట్‌లను పూర్తి ఉచితంగా అందించనున్నారు. ఆ ఫ్లాట్‌లన్నీ సంస్థ భవనానికి కేవలం ఐదు కిలోమీటర్ల పరిధిలో నగరంలోనే ఉన్నాయట (boss gifts house to employees).
ఈ ఏడాది ఐదుగురు ఉద్యోగులకు ఐదు ఫ్లాట్‌లను అందిస్తారట (employee incentive news). రాబోయే మూడేళ్లలో మిగిలిన 13 ఫ్లాట్‌లను 13 మంది ఉద్యోగులకు అందించబోతున్నారట. ఉద్యోగులలో సంస్థ పట్ల నమ్మకం పెంచడం, ఉత్తమ ప్రతిభను నిలుపుకోవడం కోసమే ఇలా చేస్తున్నట్టు కంపెనీ యజమాని తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వబోయే ఫ్లాట్‌లు పూర్తి విలాసవంతంగా, అన్ని సౌకర్యాలతో ఉండబోతున్నట్టు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
అరటిపండు సుత్తిలా మారుతుంది.. వేడినీరు సెకెన్లలో గడ్డకడుతుంది..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 37ల మధ్యలో 87 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..