Coldest place on earth: అరటిపండు సుత్తిలా మారుతుంది.. వేడినీరు సెకెన్లలో గడ్డకడుతుంది..
ABN , Publish Date - Dec 21 , 2025 | 03:51 PM
చలికాలంలో, ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశంలో ప్రజలు ఎలా నివసిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో మీకు తెలుసా? రష్యాలోని యాకుట్స్క్ నగరం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ప్రస్తుత చలికాలంలో దేశమంతా వణికిపోతోంది. అనేక ప్రాంతాలలో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనదేశంలో చలికాలం అంత పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ చలికాలంలో, ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశంలో ప్రజలు ఎలా నివసిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో మీకు తెలుసా? రష్యాలోని యాకుట్స్క్ నగరం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు (coldest place on earth).
యాకుట్స్క్ నగరంలో దాదాపు 3,55,000 మంది నివసిస్తున్నారు. సంవత్సరంలో ఎక్కువ కాలం ఇక్కడ చల్లగానే ఉంటుంది. జనవరిలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత -42°C. శీతాకాలంలో నగరంలో రోజుకు నాలుగు గంటల కంటే తక్కువ సమయం మాత్రమే సూర్యరశ్మి ఉంటుంది. యాకుట్స్క్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత -64.4°C (ఫిబ్రవరి 5, 1891న). అంటే చలి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించవచ్చు. ఈ ప్రాంతానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (siberia coldest place).
బయట వదిలేసిన బట్టలు, కార్లు, ఇతర వస్తువులు ఏవైనా సెకన్లలో గడ్డకట్టుకుపోతాయి (extreme cold weather). బయట ఉంచిన అరటిపండు సుత్తిలా ఎలా మారిపోయిందో, చెక్క ముక్కకు మేకును కొట్టడానికి ఎలా ఉపయోగించవచ్చో వీడియోలో చూపించారు. అలాగే ఆ నగరంలో కార్ల ఇంజిన్లను ఎప్పుడూ ఆన్ చేసే ఉంచాలి. లేదంటే అవి కూడా ఘనీభవిస్తాయి. తాజా కూరగాయలు, పండ్లు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి శాఖాహారులు యాకుట్స్క్‌కు దూరంగా ఉండాల్సిందే.
ఇక్కడ మాంసం ప్రధాన ఆహారం. చేపలు, మాంసం ఘనీభవించిన రూపంలోనే దొరుకుతాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రావడం ఆ నగర వాసులకు ఓ పెద్ద టాస్క్. బయటకు వెళ్లాలంటే దాదాపు పది కేజీల బరువుండే బట్టలు వేసుకోవాలి. చర్మం బయటకు కనిపించకుండా బట్టలు, బూట్లు, క్యాప్‌లు ధరించాలి. ఆరుబయట స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించడం కదరదు. నిమిషాలలో అవి షట్‌డౌన్ అయిపోతాయి. ఆ ప్రదేశంలో నివసించడమే ఒక పెద్ద ఛాలెంజ్.
ఇవి కూడా చదవండి..
హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..