Husband caught wife: హోటళ్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:48 PM
ప్రస్తుతం చాలా మంది కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. వివాహ బంధంలో ఉన్న పురుషుడు లేదా స్త్రీ పరాయి వాళ్ల వ్యామోహంలో పడి తమ భాగస్వామిని మోసం చేస్తున్నారు. ఫలితంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది.
పురుషుడు లేదా స్త్రీ పరాయి వాళ్ల వ్యామోహంలో పడి తమ భాగస్వామిని మోసం చేస్తున్నారు. ఫలితంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ వ్యక్తి పరిస్థితి తెలుసుకుంటే బాధ పడక తప్పదు. అతడికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అతడి భార్య గత ఎనిమిదేళ్లుగా భర్తను మోసం చేస్తూనే ఉంది (wife with friend in hotel).
అమృత్‌సర్‌కు చెందిన రవి గులాటి అనే వ్యక్తి ఏప్రిల్ 25, 2010న హిమానిని వివాహం చేసుకుడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018లో హిమాని తన ప్రియుడితో కలిసి ఒక హోటల్‌లో ఉండగా భర్తకు పట్టుబడింది. ఆ సమయంలో, రెండు కుటుంబాల సమక్షంలో చర్చలు జరిగాయి. హిమాని క్షమాపణ చెప్పి భర్త, పిల్లలతో కలిసి ఉంది. కొన్నేళ్లు బాగానే ఉన్న హిమాని మళ్లీ తప్పుడు దారిలోకే వెళ్లింది. భార్య వ్యవహారంపై భర్తకు అనుమానం రావడంతో అతడు ఆమె స్కూటీలో జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు (marriage betrayal story).
ఆదివారం మధ్యాహ్నం హిమాని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె స్కూటీని రవి ట్రాక్ చేశాడు (emotional husband video). అది ఒక హోటల్ దగ్గర ఉన్నట్టు తేలింది. రవి నేరుగా ఆ హోటల్ దగ్గరకు వెళ్లాడు. హోటల్‌కు చేరుకున్న రవి తన భార్యను మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఇక, భార్యతో కలిసి ఉండేది లేదని తేల్చి చెప్పాడు. స్థానిక ఎమ్మెల్యే వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. దీంతో హిమాని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి..
కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..
ఈ రైతు తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు.. ఎక్కడుందో కనిపెట్టండి..