Share News

Hyderabad: యూకే డాక్టర్‌ పేరుతో చీటింగ్‌..

ABN , Publish Date - Dec 05 , 2025 | 08:20 AM

యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: యూకే డాక్టర్‌ పేరుతో చీటింగ్‌..

- ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని మోసం

- రూ.3.38 లక్షలకు టోకరా

హైదరాబాద్‌ సిటీ: యూకేలో వైద్యుడిగా పని చేస్తున్నానంటూ ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వీసా కోసం ఎదురుచూస్తున్న మహిళకు వరుస ఫోన్‌లు చేసి పలు చార్జీల పేరుతో రూ.3.38 లక్షలు వసూలు చేసి మాయమయ్యాడు. సైదాబాద్‌(Saidabad)కు చెందిన మహిళ(47)కు ఆన్‌లైన్‌లో హిరాద్‌ అహ్మద్‌(Hirad Ahmed) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. యూకేలో వైద్యుడిగా పనిచేస్తున్నానని నమ్మించి వాట్సప్‌ చాటింగ్‌, వీడియో కాల్‌ చేసేవాడు. యూకేకు వస్తే పెళ్లి చేసుకుంటాననని నమ్మించాడు. వీసా ప్రాసెసింగ్‌లో భాగమని చెప్పడంతో ఆమె బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు యూకే అఫైర్స్‌ ఆఫీస్‌ పేరుతో అతడు సూచించిన అడ్రస్ కు పంపింది.


city4.2.jpg

వివాహ పత్రాల ప్రాసెసింగ్‌ మొదలైందని చెప్పి నకిలీ పత్రాలు పంపాడు. తర్వాత కొత్త నెంబర్ల నుంచి ఆమెను సంప్రదించిన సైబర్‌ నేరగాళ్లు పలు చార్జీలు, విమాన టికెట్లు, మెడికల్‌ ఫీజులు, రిఫండబుల్‌ ఎమౌంట్‌ అంటూ పలుదఫాలుగా రూ.3.38 లక్షలు వసూలు చేశారు. యూకే డాక్టర్‌ అందుబాటులోకి రాకపోవడం, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వచ్చి డబ్బులు డిమాండ్‌ చేయడంతో తాను మోసపోయానని గ్రహించి ఆమె సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 05 , 2025 | 08:20 AM