Online Gaming Bill: గేమ్ ఓవర్.. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:04 PM
డబ్బులతో ముడిపడిన్ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించే కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. 'ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025' పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
డబ్బులతో ముడిపడిన్ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించే కీలక బిల్లుకు (Online Gaming Bill) పార్లమెంట్ ఆమోదం లభించింది. 'ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025' పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఈ బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఈ రోజు రాజ్యసభలో కూడా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. విపక్షాలు చర్చకు పట్టుబట్టినా ఉభయ సభల్లోనూ ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది (Online Gaming Bill was passed).
ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ రంగంపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నవారు ఇబ్బందులు పడతారని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ భయాలు అర్థరహితమని కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు కొట్టిపడేశారు. ఈ బిల్లు ప్రకారం.. అన్ని రకాల ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో పాటు ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ లాటరీలు కూడా నిషేధం. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే అన్ని క్రీడల పైనా నిషేధం అమలవుతుంది. ఇకపై, ఆన్‌లైన్ గేమ్‌లను ప్రమోట్ చేసిన వారు, ఆన్‌లైన్ గేమ్‌లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను నిర్వహించే బ్యాంకులు, సంస్థలు కూడా నేరస్థుల కిందకే వస్తారు.
ఆన్‌లైన్ గేమ్‌ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా నేరమే. మన దేశంలోనే కాకుండా దేశ సరిహద్దుల్లో, విదేశీ గడ్డపై నుంచి ఆన్‌లైన్ గేమ్‌లను నిర్వహించినా వారిని దోషులుగానే పరిగణిస్తారు. అయితే ఆ ఆన్‌లైన్ గేమ్‌ల్లో పాల్గొన్న వారిని మాత్రం దోషులుగా కాకుండా, బాధితులుగా పరిగణిస్తారు. అయితే డబ్బు ప్రమేయం లేని ఈ-స్పోర్ట్స్ మాత్రం చట్టబద్ధమే అవుతాయి. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్‌ను ఆడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి