Share News

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:51 PM

సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందుకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్సే కారణంగా తెలుస్తోంది.

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య
Constable On Online Betting Games

సంగారెడ్డి జిల్లా, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి (Sangareddy) మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ (Online Betting Games) వ్యసనానికి లోనై ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు సందీప్.


విషయం తెలిసిన వెంటనే ఎస్పీ పరితోష్ పంకజ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి కానిస్టేబుల్ సందీప్ భారీగా డబ్బులు నష్టపోయినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ ఆడేందుకు తన సహచర కానిస్టేబుళ్ల దగ్గర భారీగా అప్పులు చేసినట్లు సమాచారం. అయితే, అప్పుగా ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని సహచర కానిస్టేబుళ్లు ఒత్తిడి చేయడంతో సందీప్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. కానిస్టేబుల్ సందీప్‌ ఆత్మహత్యపై ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 07:23 PM