Share News

CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:51 PM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సర్వే పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేని సోమవారం నుంచి ప్రారంభించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
CM Revanth Reddy ON SLBC Tunnel Survey

నాగర్ కర్నూల్ జిల్లా, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సర్వే పనుల (SLBC Tunnel Survey Works)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేని ఈరోజు(సోమవారం) నుంచి ప్రారంభించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తొలిరోజు సర్వేను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకి బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.


ముందుగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి సీఎం, మంత్రులు చేరుకుంటారు. అక్కడ హెలీ మాగ్నేటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్‌ని.. అందులో ఉన్న అధునాతన పరికరాలను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలిస్తారు. అక్కడే సర్వే హెలికాఫ్టర్‌‌కి జెండా ఊపి టేకాఫ్ సిగ్నల్ ఇస్తారు ముఖ్యమంత్రి. మన్నెవారిపల్లె సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ అవుట్ లెట్ వైపు నుంచి ఈ సర్వేని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులున్న హెలికాఫ్టర్‌ కూడా సర్వే హెలికాఫ్టర్‌తో పాటు బయలుదేరి సమాంతరంగా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించనుంది.


ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలిస్తారు. ఎన్‌జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే జరుగనుంది. హెలికాఫ్టర్‌కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్‌మీటర్‌తో ఈ సర్వేని చేపట్టనున్నారు. అలాగే, భూమిలో 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటాను సేకరిస్తారు. భూమి లోపల ఉండే షీర్‌జోన్లు, నీటి ప్రవాహాలని గుర్తించేందుకు ఇది హైటెక్ సర్వే పద్ధతి అని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 03:01 PM