Share News

IndiGo Crisis : ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:30 PM

ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.

IndiGo Crisis : ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం
Indigo Crisis

న్యూఢిల్లీ: ఇండిగో ఫ్లైట్ సర్వీసులు (IndiGo Flight Services) పెద్దఎత్తున రద్దవుతుండటంతో తలెత్తిన సంక్షోభంపై కేంద్రం చర్యలకు దిగింది. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు నిర్ణయించినట్టు తెలిపింది. సంక్షోభానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


గత నాలుగైదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో‌ సర్వీసుల్లో ఎక్కడ పొరపాటు జరిగింది, ఇందుకు బాధ్యులెవరనేది దర్యాప్తులో గుర్తించి, అవరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. భవిష్యత్తుల్లో ఇలాంటి అంతరాయాలు తలెత్తకుండా, ప్రయాణికులకు కష్టం కలకుండా చూస్తామని వివరించింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పేషెంట్లు, ఇతరులు అర్జెంట్ అవసరాల కోసం ప్రయాణాలు సాగిస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంటుందని పేర్కొంది. ఫ్లైట్ సర్వీసులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నామని, మూడు రోజుల్లోగా పూర్తిగా పునరుద్ధిస్తామని తెలిపింది.


దర్యాప్తు కమిటీ..

కాగా, నలుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీని కేంద్రం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్‌కు కలిగిన తీవ్ర అంతరాయం, ఇందుకు దారితీసిన పరిస్థితులపై కమిటీ దర్యాప్తు చేసి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించనుంది.


ఇవి కూడా చదవండి..

శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

అమెరికాకు బిగ్ షాక్.. ఆ విషయంలో భారత్‌కు అండగా రష్యా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 06:15 PM