Agniveer Recruitment 2025: టెన్త్, ఇంటర్ అర్హతతో అగ్నివీర్ జాబ్స్..సమీపిస్తున్న గడువు, అప్లై చేశారా..
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:00 PM
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది. టెన్త్, ఇంటర్ చదివిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.30 వేలకుపైగా జీతం లభిస్తుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లో అగ్నీవీర్ వాయు పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ర్యాలీలు జలంధర్, వడోదరా, బరిపాడా, చెన్నై, ముంబై నగరాల్లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 14, 2025 వరకు నిర్వహించబడతాయి. అయితే వీటికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎంపిక ప్రక్రియ, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, జీతం వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పోస్ట్ పేరు: అగ్నీవీర్ వాయు
ఎంపిక విధానం: రిక్రూట్ మెంట్ ర్యాలీ ద్వారా
ర్యాలీ తేదీలు: ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 14, 2025 వరకు
అధికారిక వెబ్‌సైట్: agnipathvayu.cdac.in
ర్యాలీ తేదీలు
జలంధర్, పంజాబ్ ఆగస్టు 27 – ఆగస్టు 31, 2025
వడోదరా, గుజరాత్ ఆగస్టు 27 – ఆగస్టు 31, 2025
బరిపాడా, ఒడిషా ఆగస్టు 27 – సెప్టెంబర్ 03, 2025
చెన్నై, తమిళనాడు ఆగస్టు 27 – సెప్టెంబర్ 06, 2025
ముంబై, మహారాష్ట్ర సెప్టెంబర్ 09 – సెప్టెంబర్ 13, 2025
అర్హతలు
జనవరి 1, 2005 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక సమయంలో గరిష్ట వయస్సు: 21 ఏళ్లు
నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదు
మహిళలు గర్భవతి కాకుండా ఉండాలి. రూల్స్ పాటించకపోతే విధుల నుంచి తొలగింపు
విద్యార్హత
10+2 / ఇంటర్ – కనీసం 50% ఓవరాల్, 50% ఇంగ్లీష్‌లో
లేదా 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు – 50% ఓవరాల్, 50% ఇంగ్లీష్‌లో
లేదా 3 సంవత్సరాల డిప్లొమా (ఇంజనీరింగ్: మెకానికల్, ఎలక్ట్రికల్, IT మొదలైనవి) – 50% ఓవరాల్, 50% ఇంగ్లీష్‌లో
ఫిజికల్ & మెడికల్ స్టాండర్డ్స్
ఎత్తు: పురుషులు – 152 సెం.మీ, మహిళలు – 152 సెం.మీ (కొన్ని ప్రాంతాలకు రాయితీ ఉంది)
బరువు: ఎత్తుకు అనుగుణంగా ఉండాలి.
ఛాతీ: పురుషులు – కనీసం 77 సెం.మీ (5 సెం.మీ విస్తరణ)
కంటి చూపు: 6/12 (correctable to 6/6)
మయోపియా: –1.0D, హైపర్‌మెట్రోపియా: +2.0D
ఎంపిక విధానం
పత్రాల పరిశీలన – విద్య, ధృవపత్రాల తనిఖీ
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT-I & II)
1.6 కిలోమీటర్ల పరుగులు
పురుషులు: 7 నిమిషాల్లో
మహిళలు: 8 నిమిషాల్లో
పుష్-అప్స్, సిట్-అప్స్, స్క్వాట్స్ (జెండర్ ఆధారంగా భిన్నంగా ఉంటుంది)
రాత పరీక్ష
వ్యవధి: 45 నిమిషాలు
ఎంపికైన తర్వాత నెలకు జీతం
మొదటి సంవత్సరం రూ.30,000
రెండవ సంవత్సరం రూ.33,000
మూడవ సంవత్సరం రూ.36,500
నాలుగవ సంవత్సరం రూ.40,000
ఇతర ప్రయోజనాలు
ఉచిత వైద్య సేవలు (సర్వీస్ సమయంలో)
వార్షిక సెలవులు – 30 రోజులు
సిక్ లీవ్ – డాక్టర్ సూచన మేరకు
జీవిత బీమా – రూ.48 లక్షల వరకు (ఉచితం)
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి