అయ్యర్ అదిరేలా..
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:32 AM
వెస్టిండీ్‌సతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సను భారత్ ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 నాటౌట్) ధనాధన్ సెంచరీతో అదరగొట్టాడు...
42 బంతుల్లోనే సెంచరీ
తొలి టీ20లో విండీస్‌పై భారత్ ఘనవిజయం
పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా జైత్రయాత్ర సాగిస్తోంది. అంతేకాకుండా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక శ్రేయాస్ అయ్యర్ తొలిసారి అసలు సిసలైన ఆటను ప్రదర్శించాడు. విండీస్ బౌలర్లను కకావికలు చేస్తూ 42 బంతుల్లోనే కెరీర్‌లో మొదటి సెంచరీని అందుకున్నాడు. అటు విండీస్ కెప్టెన్ హోప్, రూథర్‌ఫోర్డ్ మినహా ఎవరూ రాణించకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. మరోవైపు భారత జట్టుకిది వరుసగా పదో టీ20 విజయం కావడం విశేషం.
లఖ్‌నవూ: వెస్టిండీ్‌సతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సను భారత్ ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 నాటౌట్) ధనాధన్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మంగళవారం జరిగిన ఈ తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టీ20 రాంచీలో 9న జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. హోప్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52), షెర్ఫానో రూథర్‌ఫోర్డ్ (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ నమన్ ధిర్ మూడు వికెట్లతో దెబ్బతీశాడు. ఇతర స్పిన్నర్లు అక్షర్, కుల్దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. భారత బౌలర్ల ధాటికి ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. ఆ తర్వాత ఛేదనలో భారత్ 14.4 ఓవర్లలో 2 వికెట్లకు 172 పరుగులు చేసి గెలిచింది. ఇషాన్ కిషన్ (37 నాటౌట్), అభిషేక్ (21) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా శ్రేయాస్ నిలిచాడు.
శ్రేయా్‌స-కిషన్ శతక భాగస్వామ్యం: ఛేదనలో భారత్ ఏ దశలోనూ ఇబ్బందిపడలేదు. ఓపెనర్ శాంసన్ (11) విఫలమైనా అభిషేక్ ఎదురుదాడి ఆపలేదు. తొలి ఓవర్‌లోనే తను 6,4,4తో 15 రన్స్ అందించాడు. అయితే వరుస ఓవర్లలో ఓపెనర్లు వెనుదిరిగారు. కానీ ఐదో ఓవర్ నుంచి కెప్టెన్ శ్రేయా్‌స-ఇషాన్ జోడీ బౌలర్లను ఆటాడేసుకుంది. ఈ జోరుతో 28 బంతుల్లో శ్రేయాస్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం వేగం పెంచి 14వ ఓవర్‌లో 24 రన్స్ రాబట్టాడు. లాంగాన్‌లో భారీ సిక్స్‌తో మొదటి సెంచరీని కూడా పూర్తి చేసి, మరో సింగిల్‌తో 32 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు. అటు ఇషాన్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 137 పరుగులు అందించడం విశేషం.
ఆడింది ఇద్దరే..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ సత్తాచాటారు. చివర్లో అకీల్ హొసీన్ విలువైన పరుగులు జోడించాడు. విండీస్ మిడిల్ ఓవర్లలో 28 పరుగుల తేడాతోనే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ హోప్ మాత్రం రెండో ఓవర్‌లోనే నాలుగు ఫోర్లతో బ్యాట్‌కు పనిజెప్పాడు. అటు ఎనిమిది బంతుల తేడాలోనే మరో ఓపెనర్ కమిల్ (12), హెట్‌మయెర్ (5), పోవెల్ (0) పెవిలియన్‌కు చేరడంతో విండీస్ పవర్‌ప్లేలో 44/3 స్కోరుతో నిలిచింది. ఈ దశలో హోప్, రూథర్‌ఫోర్డ్ నిలకడగా ఆడారు. 11వ ఓవర్‌లో హోప్ 4, రూథర్‌ఫోర్డ్ 4,6తో 18 రన్స్ రాగా స్కోరు 100కి చేరింది. ఇక మరో సిక్సర్‌తో 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన హోప్ తర్వాత బంతికే నమన్ చేతికి చిక్కాడు. అనంతరం స్పిన్నర్లు టపటపా వికెట్లు తీయడంతో జట్టు 135 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయింది. డెత్ ఓవర్లలో రూథర్‌ఫోర్డ్, హొసీన్ భారీ షాట్లకు వెళ్లి వేగంగా పరుగులందించారు. అయితే బౌలర్ల ధాటికి మరో ఐదు బంతులుండగానే విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
స్కోరుబోర్డు
వెస్టిండీస్: హోప్ (సి) అక్షర్ (బి) నమన్ 52, కమిల్ (బి) అర్ష్‌దీప్ 12, హెట్‌మయెర్ (రనౌట్) 5, పోవెల్ (బి) అక్షర్ 0, రూథర్‌ఫోర్డ్ (సి) నమన్ (బి) మయాంక్ 56, చేజ్ (ఎల్బీ) కుల్దీప్ 5, షెఫర్డ్ (సి) తిలక్ (బి) నమన్ 7, ఫోర్డ్ (సి) ఇషాన్ (బి) కుల్దీప్ 2, స్ర్పింగర్ (సి) అక్షర్ (బి) నమన్ 9, హొసీన్ (సి) ఇషాన్ (బి) అక్షర్ 15, షామర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.1 ఓవర్లలో 171 ఆలౌట్; వికెట్ల పతనం: 1-38, 2-44, 3-44, 4-107, 5-114, 6-121, 7-124, 8-135, 9-171, 10-171. బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-34-1, మయాంక్ 4-0-40-1, అక్షర్ 3.1-1-26-2, కుల్దీప్ 4-0-33-2, నమన్ 4-0-31-3.
భారత్: శాంసన్ (సి అండ్ బి) హొసీన్ 11, అభిషేక్ (సి) హెట్‌మయెర్ (బి) చేజ్ 21, ఇషాన్ (నాటౌట్) 37, శ్రేయాస్ (నాటౌట్) 102; ఎక్స్‌ట్రాలు:1; మొత్తం: 14.4 ఓవర్లలో 172/2; వికెట్ల పతనం: 1-29, 2-35; బౌలింగ్: ఫోర్డ్ 2-0-39-0, హొసీన్ 4-0-37-1, చేజ్ 3.4-0-37-1, జోసెఫ్ 2-0-23-0, షెఫర్డ్ 2-0-24-0, స్ర్పింగర్ 1-0-12-0.
3
టీ20 ఛేదనలో భారత్ తరఫున అత్యధిక స్కోరు (102 నాటౌట్) సాధించిన మూడో బ్యాటర్‌గా శ్రేయాస్. సూర్యకుమార్ (117), రాహుల్ (110 నాటౌట్) ముందున్నారు. అలాగే ఈ ఫార్మాట్‌లో శతకం బాదిన మూడో భారత కెప్టెన్.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన