‘సర్’పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. నేతలకు రాంచందర్ రావు పిలుపు
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:37 PM
‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని నేతలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించిందని వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని నేతలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఈరోజు(శనివారం) నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, ఆల్ సెల్స్ కన్వీనర్లు, అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించిందని వెల్లడించారు.
బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారు. వరుస ఎన్నికల ఓటములతో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా
వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం
Read Latest Telangana News And Telugu News