Share News

పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జలకళ.. 500 టీఎంసీల గోదావరి జలాల వినియోగం

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:18 AM

గోదావరి జలాల సద్వినియోగంలో పట్టిసీమ అద్భుత విజయం సాధించింది. పట్టిసీమ లిఫ్ట్ ద్వారా ఇప్పటి వరకు 500 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రైతులు వినియోగించుకున్నారు.

పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జలకళ.. 500 టీఎంసీల గోదావరి జలాల వినియోగం
Pattiseema Project

అమరావతి, అక్టోబర్ 10: గోదావరి జలాల సద్వినియోగంలో పట్టిసీమ అద్భుత విజయం సాధించింది. పట్టిసీమ లిఫ్ట్ ద్వారా ఇప్పటి వరకు 500 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రైతులు వినియోగించుకున్నారు. 12 ఏళ్ల వ్యవధిలో, 1033 రోజుల్లో కృష్ణా బేసిన్‌కు 500 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను తరలించారు. ఎల్‌నినో వంటి సమయంలోనూ 57 టీఎంసీలకు పైగా గోదావరి జలాల సద్వినియోగం చేసుకోవడం ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యాన్ని చాటుతోంది.


కృష్ణ డెల్టా రైతులకు తప్పిన నీటి కష్టాలు

అనేక అడ్డంకులను అధిగమించి పట్టిసీమ నిర్మాణాని నాటి చంద్రబాబు సర్కార్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా పట్టిసీమ ప్రాజెక్ట్ డిజైన్‌ను రూపొందించారు. దాదాపు రూ.1,651 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్‌‌ను నిర్మించారు. కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా పట్టిసీమ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. రికార్డు స్థాయిలో పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవగా.. తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తితో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోనూ చోటు దక్కించుకుంది. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టా రైతులకు నీటి కష్టాలు తప్పినట్లైంది. ఆక్వా రైతులకు కొండంత అండగాఈ ప్రాజెక్ట్ నిలిచింది.


రాయలసీమకూ జలకళ

పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు రూ.1 లక్ష కోట్లకుపైగా సంపద సృష్టి జరిగిందని సాగునీటి సంఘాలు చెబుతున్నాయి. వ్యవసాయం ద్వారా రూ. 26,775 కోట్లు, ఆక్వా ద్వారా రూ.78 వేల కోట్ల మేర సంపద సృష్టి జరిగందని వివరిస్తున్నాయి. పట్టిసీమ ద్వారా రాయలసీమకూ జలకళ సంతరించుకుంది. కృష్ణా డెల్టాకు గోదావరి జలాల వినియోగంతో శ్రీశైలంలో కృష్ణాజలాలను ప్రభుత్వం ఆదా చేసింది. కృష్ణా డెల్టా అవసరాలు పట్టిసీమ తీర్చడంతో, శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టుల ద్వారా సీమకు మళ్లించే అవకాశం ఉంది. శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తరలించి సీమ రైతులకు సర్కార్ మేలు చేకూర్చింది. సీమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ పరోక్షంగా తోడ్పాటుగా నిలిచింది.


వైసీపీ విమర్శలను పటాపంచలు చేస్తూ..

పట్టిసీమ ప్రాజెక్టు ఏర్పాటుపై నాడు వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. పట్టిసీమ-వట్టిసీమ అంటూ మాజీ సీఎం జగన్ రెడ్డి ఆనాడు అక్కసు వెళ్లగక్కారు. నాటి వైసీపీ ప్రభుత్వం.. పట్టిసీమపైనా కక్ష సాధింపు ధోరణితోనే ఆలోచించిందని, పూర్తి స్థాయిలో పట్టిసీమను వినియోగించకుండా నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ విమర్శలను పటాపంచలు చేస్తూ విజయవంతంగా గోదావరి జలాలను పట్టిసీమ ప్రాజెక్ట్ సద్వినియోగం చేసింది. పట్టిసీమ కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి... 60 రెట్ల కంటే ఎక్కువగా సంపద సృష్టించి జల విజయంతో పాటు, ఆర్థిక విజయాన్ని కూడా ఈ ప్రాజెక్ట్ నమోదు చేసింది.


పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్లోకి వచ్చిన గోదావరి జలాల వివరాలు:

  • 2015లో: 75 రోజుల్లో 4.20 టీఎంసీలు

  • 2016లో: 134 రోజుల్లో 55.75 టీఎంసీలు

  • 2017లో: 161 రోజుల్లో 105.80 టీఎంసీలు

  • 2018లో: 165 రోజుల్లో 96.94 టీఎంసీలు

  • 2019లో: 90 రోజుల్లో 42.99 టీఎంసీలు

  • 2020లో: 64 రోజుల్లో 41.54 టీఎంసీలు

  • 2021లో: 16 రోజుల్లో 1.64 టీఎంసీలు

  • 2022లో: పంపింగ్ జరగలేదు (0.00 టీఎంసీలు)

  • 2023లో: 119 రోజుల్లో 58.72 టీఎంసీలు

  • 2024లో: 44 రోజుల్లో 20.62 టీఎంసీలు

  • 2025లో: 73 రోజుల్లో 14.21 టీఎంసీలు

  • 2026లో: 92 రోజుల్లో 57.70 టీఎంసీలు


ఇవి కూడా చదవండి...

కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా

వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 11:20 AM