తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, 10 మందికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:18 AM
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రెండు భారీ వాహనాలు ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
తిరుపతి, అక్టోబర్ 10: రెండు వాహనాలు ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని తొట్టంబేడు మండలం పరిధిలోని చిన్న సింగమాల సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పోలీసులు, స్థానికుల కథనం మేరకు జిల్లాలోని తొట్టంబేడు పరిధిలోని చిన్నసింగమాల సమీపంలో ప్రమాదవశాత్తు రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మంజునాథ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కాగా.. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాత్రి వేళల్లో రోడ్లపై బర్త్ డే పార్టీలొద్దు!
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!
నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్