Share News

హైదరాబాద్‌లో చోరీ.. నిర్మాణంలో ఉన్న ఇంట్లో విద్యుత్ సామగ్రి అపహరణ

ABN , Publish Date - Oct 10 , 2026 | 10:44 AM

హైదరాబాద్‌లో దొంగలు హల్‌చల్ చేశారు. ఉప్పల్‌ శ్రీరాఘవేంద్ర నగర్‌ కళ్యాణపురిలోకి ప్రవేశించిన దొంగలు.. నిర్మాణంలో ఉన్న ఇంట్లో విద్యుత్‌ తీగలు, సామగ్రిని చోరీ చేశారు.

హైదరాబాద్‌లో చోరీ.. నిర్మాణంలో ఉన్న ఇంట్లో విద్యుత్ సామగ్రి అపహరణ
Hyderabad News

హైదరాబాద్, అక్టోబర్ 10: నగరంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఉప్పల్‌ శ్రీరాఘవేంద్ర నగర్‌ కళ్యాణపురిలోకి ప్రవేశించిన దొంగలు.. నిర్మాణంలో ఉన్న ఇంట్లో విద్యుత్‌ తీగలు, సామగ్రిని చోరీ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిర్మాణంలోని ఇంట్లోకి ప్రవేవించిన ముగ్గురు వ్యక్తులు విద్యుత్ సామాగ్రిని అపహరించారు. కళ్యాణపురిలో సీసీకెమెరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు రికార్డు అయ్యాయి.


ఉదయం ఇంటి యజమాని వచ్చి చూడగా.. విద్యుత్ సామాగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే కాలనీలో చోరీ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రాత్రివేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా

వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 10:47 AM