విజయవాడ దసరా ఉత్సవాలు.. సీఎం విజయ్‌కు ఆహ్వానం
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:35 PM
విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు ఆహ్వానం పలికారు.
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు (Tamil Nadu CM Joseph Vijay) ఆహ్వానం పలికారు. విజయవాడ ఉత్సవ్ 2.0కు హాజరై నగర సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌ను విజయవాడ ఉత్సవ్ ప్రతినిధి బృందం ఈరోజు (మంగళవారం) కలిసింది.
విజయ్‌ను కలిసిన వారిలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీశ్ బాలయోగి ఉన్నారు. కనకదుర్గమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాటు విజయవాడ సంస్కృతి, వారసత్వాన్ని ఆస్వాదించాలని ఆహ్వానించారు. విజయవాడ ఉత్సవ్ 2.0కు విజయ్ రాక కోసం ఎదురుచూస్తున్నామని విజయవాడ ప్రతినిధి బృందం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News