ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:32 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కలిశారు. ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణపతకం సాధించిన సురేఖను అభినందించారు.
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను (AP Minister Nara Lokesh) ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఈరోజు (సోమవారం) కలిశారు. ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణపతకం సాధించిన సురేఖను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా లోకేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్-2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో సురేఖ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే.

సురేఖ తండ్రి సురేంద్రకుమార్ ఇవాళ ఉండవల్లి నివాసంలో లోకేశ్‌తో సమావేశం అయ్యారు. ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు నాలుగు గోల్డ్ మెడల్స్ సహా ఆరు పతకాలను సురేఖ సాధించారు. ఏషియన్ గేమ్స్‌లో తన ప్రతిభతో స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, తాము అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి లోకేశ్ భరోసా కల్పించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News