Share News

గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 04 , 2026 | 02:21 PM

కూటమి ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వానికి ఎదురులేదు.. తిరుగులేదని ఉద్ఘాటించారు.

 గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

గుంటూరు జిల్లా, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వానికి ఎదురులేదు.. తిరుగులేదని ఉద్ఘాటించారు. జగన్ హయాంలో విధ్వంసమైన ఏపీని పునర్నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిశామని చెప్పుకొచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు ఈరోజు (ఆదివారం) పర్యటించారు. కేంద్రమంత్రి శివరాజ్‍ సింగ్ చౌహాన్‍తో కలిసి బుర్రిపాలెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెం నుంచి శంకుస్థాపన చేశారు. త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఓబులనాయుడుపాలెంలో రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్‍తో 117 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.


9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం..

ఏపీకి 75 వేల ఇళ్లు సరిపోవని కేంద్రప్రభుత్వానికి చెప్పామని సీఎం చంద్రబాబు అన్నారు. తాను అడిగిన వెంటనే 3 లక్షల ఇళ్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని వివరించారు. 3 లక్షల ఇళ్లు చాలవని.. 9 లక్షల ఇళ్లు కావాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. పేదల సొంతింటి కల సాకారం చేయాలని తాము సంకల్పించామని అన్నారు. తన సంకల్పానికి తోడుగా కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చేయి కలిపారని తెలిపారు. 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని.. ప్రతి పేదవాడు బాగుపడాలని ఆకాంక్షించారు. బుర్రిపాలెం నుంచి సినీహీరో కృష్ణ.. పొలిటికల్ హీరో పెమ్మసాని వచ్చారని ప్రశంసించారు. అభివృద్ధిలో పెమ్మసాని ఎక్కడా వెనకడుగు వేయలేదని చెప్పారు. ధరలు పెరగకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. 3 నెలల్లోనే 3D కాంక్రీట్‌ ఇల్లు కట్టవచ్చని తెలిపారు. వైసీపీ హయాంలోని 2019-24 మధ్య అన్ని రంగాలను విధ్వంసం చేశారని ఆగ్రహించారు.


జగన్ హయాంలో నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు..

గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో.. 4 లక్షల మంది పేదలు వద్దన్నారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంతో మెగా సిటీ తయారవుతుందని తెలిపారు. ప్రజా రాజధాని మన అమరావతి అని ఉద్ఘాటించారు. ప్రపంచం మెచ్చే రాజధాని మన అమరావతి అని తెలిపారు. క్వాంటం వ్యాలీగా అమరావతి మారుతుందని వివరించారు. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. 2027 మార్చిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరాన్ని ప్రారంభిస్తామని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను కాపాడగలిగామని చెప్పుకొచ్చారు. ఆయా గ్రామాల అభివృద్ధికి రూ.1.30 లక్షల కోట్ల పనులకు ప్రణాళికలు చేశామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 02:55 PM