Share News

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:00 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్‌పై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ధ్వజమెత్తారు.

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం
Union Minister Rammohan Naidu

శ్రీకాకుళం జిల్లా, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్‌పై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. బీసీలకు వైసీపీ అన్యాయం చేసిందని ఆగ్రహించారు. ఈరోజు (శనివారం) శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలో పల్లె పండగ 3.0లో రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


పల్లెల్లో అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నాం..

పల్లె పండుగ 3.0లో పలు కార్యక్రమాలను చేపట్టినట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు. పల్లెల్లో అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. జగన్ హయాంలో చేయలేని పనులన్నీ పల్లె పండుగ ద్వారా తాము పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌పై కనీసం కాంటెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీసీలకు రాజ్యాధికారం ఇస్తే వాళ్లకు పదవులు ఇవ్వాల్సి వస్తోందని వైసీపీ రిజర్వేషన్లను అడ్డుకుందని ధ్వజమెత్తారు. బీసీలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే టీడీపీ లక్ష్యమని ఉద్ఘాటించారు.


ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోంది..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిందే తెలుగుదేశం పార్టీ అని ప్రస్తావించారు. వైసీపీకి బీసీలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందకూడదన్నదే ఆ పార్టీ ఉద్దేశమని మండిపడ్డారు. జగన్ అండ్ కో ఆటలు ఇక చెల్లవని హెచ్చరించారు. టీడీపీకి బీసీలు వెన్నెముక అని.. తమది బీసీల పార్టీ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్‌ అంబానీ

ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 05:19 PM