ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:57 PM
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యానించారు. బడుల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ (Visakhapatnam MP Sri bharat) వ్యాఖ్యానించారు. బడుల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) విశాఖపట్నంలో రూ.35 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో నవీకరించిన పాఠశాలను ఎంపీ శ్రీభరత్ పున:ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు సురక్షితమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం, ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తుంది: గవర్నర్ కంభంపాటి
రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల
ఒలింపిక్‌లో మెడల్ సాధించేలా ఏపీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
Read Latest AP News And Telangana News And National News
And Telugu News