రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Sep 30 , 2026 | 01:00 PM
ఏపీలోని రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో రూ. 35 లకు అందించే కార్యక్రమాన్ని ఈరోజు (మంగళవారం) తమ ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
విజయవాడ, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.35లకు అందించే కార్యక్రమాన్ని ఈరోజు (మంగళవారం) తమ ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (AP Minister Nadendla Manohar) ప్రకటించారు. ఇవాళ విజయవాడలోని ఏఐసీసీ కాలనీ రైతు బజార్‌లో ఉల్లిపాయల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఒక్కో రేషన్ కార్డుదారుడికి రెండు కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
బియ్యం, ఉల్లి, పప్పులు సబ్సిడీపై అందించేలా ఏర్పాట్లు..
కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల ఉద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిణామాలతో ధరలు పెరుగుతున్నాయని వివరించారు. ప్రజలపై భారం పడకుండా సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ధరల స్థిరీకరణకు నిధిని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని తెలిపారు. బియ్యం, ఉల్లి, పప్పులు సబ్సిడీపై అందించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం: సీఎం చంద్రబాబు
తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News