Share News

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:22 AM

శాంతిభద్రతలు రాష్ట్ర ప్రగతికి పునాది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి
AP Minister Kinjarapu Atchannaidu

శ్రీకాకుళం జిల్లా, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలు రాష్ట్ర ప్రగతికి పునాది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటుందని.. అందుకే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) శ్రీకాకుళం జిల్లాలో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.10 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసిన 142 మంది కానిస్టేబుళ్లను అభినందించారు. పోలీసు సేవల్లోకి అడుగుపెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.


1,156 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాం..

శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధత, క్రమశిక్షణతో పోలీసులు పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం కాదని.. సమాజ సేవలో గొప్ప బాధ్యత అని ఉద్ఘాటించారు. 8 నెలల్లో దాదాపు 5,800ల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. మరో 1,156 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పోలీసు నియామకాలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేశ్

పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక: హోం మంత్రి అనిత

హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి: విజయసాయి రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 11:57 AM