పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Sep 28 , 2026 | 10:14 AM
పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కలిగినదని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కలిగినదని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) విజయనగరం జిల్లాలో 473 మంది మహిళా కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది..
మహిళా కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని అనిత పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం ఓ భరోసా ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్‌ని, మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎంతోమంది ఆడపిల్లలకు మీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిక్షణ సమయం మీ జీవితానికి పునాది లాంటిదని ఉద్ఘాటించారు. ఏ పని అయినా ధైర్యంగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజలను రక్షించే బాధ్యతను మీరు తీసుకుంటున్నారని.. నిబద్ధతతో విధులు నిర్వహించాలని హోం మంత్రి అనిత సూచించారు.
విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో 2025-26 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. 473 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. నెల్లూరు నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాల వరకు ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను హోం మంత్రి అనిత అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పీటీసీ ప్రిన్సిపాల్ రామచంద్ర రాజు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి
శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News