Home » AP Home Minister Anitha
శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పీటీసీలో శిక్షణ పూర్తిచేసుకున్న 2025-26వ బ్యాచ్ కు 473 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది.
పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కలిగినదని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాలు కూటమి నైజం.. రౌడీయిజం జగన్ నైజమని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల వేల కోట్ల రూపాయలు సంపాదించారని...
అక్రమంగా కేసులు బనాయించి వేధించిన వారిపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ముంబయి సినీ నటి కాదంబరి జత్వాని కేసుపై ఆమె స్పందించారు. నటి కాదంబరి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.
‘గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డ్ అందిస్తాం. అందుకు అవసరమైన టోల్ ఫ్రీ నంబరును 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తాం’ అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.