విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:49 PM
విశాఖపట్నంలో ఈనెల 30వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి మాట్లాడతానని పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈనెల 30వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి మాట్లాడతానని పేర్కొన్నారు. తన ప్రెస్‌మీట్‌కు మీడియా మిత్రులు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఎక్స్(X)లో ఆయన పోస్టు పెట్టారు. రెండు కుటుంబ రాజకీయ పార్టీలతో ఏపీకి నష్టమే తప్ప.. ఎలాంటి లాభం లేదని చెప్పుకొచ్చారు.
తెరవెనుక పొత్తులు గురించి మాట్లాడతా..
ఇందుకు సంబంధించిన మరికొన్ని ఆధారాలను ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు, వైజాగ్ దస్‌పల్లా హోటల్ వేదికగా వివరిస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం, నేటి రాజకీయాల్లో తెరవెనుక పొత్తులు, గిరిజనులే టార్గెట్‌గా జరుగుతున్న మత మార్పిడులు వంటి విషయాల మీద ఈ ప్రెస్‌మీట్‌లో మాట్లాడతానని తెలిపారు. ఇంతకు ముందు విజయవాడ, అనంతపురం ప్రెస్‌మీట్ల ద్వారా రాష్ట్ర ప్రజల ముందు 10 ప్రతిపాదనలు ఉంచానని ప్రస్తావించారు. మరో 5 ప్రతిపాదనలతో విశాఖపట్టణంలో మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజా ప్రయోజనాల కోసం వైజాగ్ మీడియా ప్రతినిధులంతా ఈ ప్రెస్‌మీట్ లైవ్ కవరేజికి రావాలని విజయసాయిరెడ్డి ఆహ్వానం పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News