స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:28 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94 శాతం ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి లక్ష్యమని వ్యాఖ్యానించారు.
విజయవాడ, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి (AP Minister Kolusu Partha Sarathi) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94 శాతం ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి లక్ష్యమని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పోలిస్తే.. తమ రెండేళ్ల ప్రభుత్వంలో అపూర్వమైన అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) విజయవాడలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సర్కారులో ఉద్యోగ అవకాశాలను, సంక్షేమాన్ని అందించామని చెప్పుకొచ్చారు.
విభేదాలను పరిష్కరించేలా సమన్వయ కమిటీల ఏర్పాటు..
వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేసిన పోలవరం, వెలిగొండ వంటి నీటిపారుదల ప్రాజెక్టులను బాధ్యతాయుతంగా పూర్తి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి విజయమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేలా నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా, ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మూడు పార్టీల నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకెళ్తామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు
రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య
Read Latest Telangana News And AP News And National News
And Telugu News