సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు
ABN , Publish Date - Sep 25 , 2026 | 10:51 AM
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి (Serilingampally MLA Arekapudi Gandhi) ఈడీ అధికారులు ఈరోజు (శుక్రవారం) నోటీసులు జారీ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన ఆయన విచారణకు రావాలని ఈ నోటీసులో తెలిపారు. రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫ్రీ లాంచ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి నగదు వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులను కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మరో విడతలో రూ.12.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పటివరకు 56 బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను 2024లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ
ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News