Share News

ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:23 PM

దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్‌ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

 ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
Danam Nagender

ఢిల్లీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ పిటిషన్‌‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్‌ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో దానం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. ఆయనపై అనర్హత వేటు పడిందని.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగతంగా పార్టీలో చేరితే తప్పు కాదని.. పదవితో పాటు ఫిరాయింపు తప్పేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.


హైకోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి జోక్యం చేసుకోమని నిరాకరిస్తూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోయినా లేదా అధికారికంగా రాజీనామా పత్రం ఇవ్వకపోయినా, వేరే రాజకీయ పార్టీ టికెట్‌పై నామినేషన్ వేసి పోటీ చేయడం రాజ్యాంగబద్ధంగా పార్టీని వీడినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని... సుస్పష్టమైన ఆధారాలు (మరో పార్టీ బీ-ఫారమ్‌పై పోటీ చేయడం) ఉన్నప్పుడు స్పీకర్ చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.


సుప్రీంలో 'ఘర్ వాపసీ' వాదనలను దానం తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వినిపించారు. దానం తిరిగి సొంత పార్టీకి వచ్చి(ఘర్ వాపసీ), పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. ఆయనపై పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని అన్నారు. ఆయనపై అనర్హత వేటు పడకూడదని తెలిపారు. పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం వేరని, చట్టసభ (Legislature) సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడం వేరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తిరిగి పార్టీలోకి వచ్చినంత మాత్రాన చట్టసభ సభ్యత్వంపై పడే అనర్హత వేటు తొలగిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలమూరుకు ఉపశమనం.. నీటి విడుదలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్..

గోదావరి, దేవాదుల ప్రాజెక్టు నీళ్లను సంపూర్ణంగా వినియోగించుకుంటాం: మంత్రి ఉత్తమ్

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 02:20 PM