Share News

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 10:53 AM

వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు
Telangana Weather Alert

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు (బుధవారం) రేపు (గురువారం) తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈరోజు 8 జిల్లాలకు అత్యంత భారీ, 9 జిల్లాలకు అతి భారీ, మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు.


అత్యంత భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు అతి భారీ వర్షాల కారణంగా కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట, నల్గొండ, జిల్లలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని అన్నారు. అలాగే, మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రేపు (గురువారం) 10 జిల్లాలకు అత్యంత భారీ, మరో 10 జిల్లాలకు అతి భారీ, మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.


24వ తేదీన కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. రేపు అతి భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని అన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్పుకొచ్చారు. వర్షాలతో పాటు ఈదురు గాలుల తీవ్రత గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను శరవేగంగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 01:00 PM