Share News

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..

ABN , Publish Date - Sep 22 , 2026 | 08:01 AM

విదేశీ ఉద్యోగాల పేరుతో ఓ సంస్థ భారీ మోసం చేసింది. బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ కార్యాలయం బోర్డు తిప్పేసింది.

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
Hyderabad Foreign Job Scam

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): విదేశీ ఉద్యోగాల పేరుతో ఓ సంస్థ భారీ మోసం చేసింది. బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ కార్యాలయం బోర్డు తిప్పేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వందలాది మంది నిరుద్యోగుల నుంచి భారీగా నగదును కన్సల్టెన్సీ నిర్వాహకులు వసూలు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ బాధితులను నిర్వాహకులు నమ్మించారు. డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ నియామక పత్రాలు పంపించారని బాధితులు తెలిపారు.


తమ నుంచి డబ్బులు వసూలు చేసి ఇంటర్వ్యూలో ఎంపిక కాలేదంటూ చెప్పారని బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ కన్సల్టెన్సీ మూసివేతతో పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నారు. బాధితుల్లో కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన పలువురు ఉన్నారు.


సోషల్ మీడియాలో సౌజన్య ఇంటర్వ్యూ చూసి ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీని వందలాది మంది బాధితులు ఆశ్రయించారు. కార్యాలయం హంగూ ఆర్భాటాలు చూసి నిర్వాహకులు అడిగినంత డబ్బును బాధితులు చెల్లించారు. 400 మందికి పైగా బాధితులు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. అయితే, నాలుగు నెలల క్రితం కన్సల్టెన్సీ కార్యాలయం మూసివేసి నిర్వాహకురాలు సౌజన్య పరారయ్యారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సౌజన్యను బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై సౌజన్య విడుదలయ్యారు. కన్సల్టెన్సీ నిర్వాహకుల ఆచూకీ కోసం బేగంపేట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలు తెలంగాణలో సృష్టిస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026: మంత్రి వాకిటి శ్రీహరి

ప్రతి గ్రామపంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 08:21 AM