Share News

ప్రతి గ్రామపంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:53 PM

ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. అక్టోబర్ 2వ తేదీన గ్రామసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల ప్రణాళికపై సమీక్షించారు.

ప్రతి గ్రామపంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క
Telangana Minister Seethakka

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలని తెలంగాణ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో మంత్రి సీతక్క ఈరోజు (సోమవారం) ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీన గ్రామసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల ప్రణాళికపై సమీక్షించారు. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ దానకిషోర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో తీవ్రత అందరికీ తెలుసునని.. ఈ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


రూ.50 లక్షల పనులు చేపట్టేలా ప్రణాళిక చేస్తున్నాం..

అక్టోబర్ 2వ తేదీన గ్రామసభలు నిర్వహించి యాక్షన్ ప్లాన్‌పై తీర్మానాలను ప్రవేశపెట్టాలని మంత్రి సీతక్క మార్గనిర్దేశం చేశారు. ఆయా గ్రామాల వారీగా అవసరాలు, నిధుల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రాధాన్యం క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది పంచాయతీలకు వచ్చే అన్ని నిధులపై గ్రామసభల్లో చర్చించాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద రూ.6,700 కోట్లను ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో సగటున రూ.50 లక్షల పనులు చేపట్టేలా ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులు అడిగిన వారందరికీ కల్పించాలని సూచించారు.


ఉపాధితో పాటు సామాజిక ఆస్తుల కల్పనపై దృష్టి సారించాలి..

ఉపాధితో పాటు సామాజిక ఆస్తుల కల్పనపై దృష్టి సారించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జలసిరి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయి అధికారులకు జిల్లాల వారీగా మానిటరింగ్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. రెండు రోజుల పాటు జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. ఈ సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో పర్యటించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 06:13 PM