Share News

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:36 PM

కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్
Bandi Sanjay Kumar

కరీంనగర్ జిల్లా, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఈరోజు (ఆదివారం) కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ తను వినాయకుడితో పోల్చుకోవడం సరికాదని పేర్కొన్నారు. వినాయకుడిని చివరిలో నిమజ్జనం చేస్తారనే విషయం దానం నాగేందర్‌కు తెలియదా.? అని ప్రశ్నించారు.


దానం నాగేందర్ నిండు నూరేళ్లు జీవించాలని బండి సంజయ్ కోరుకున్నారు. కాంగ్రెస్ తమకు పోటీనే కాదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ సందర్శన ఓ జోక్ లాగా ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ ఫాంహౌస్‌లు ఏమైనా టూరిజానికి కేంద్రాలా.? అని ప్రశ్నించారు. ప్రైవేటు భూముల్లోకి వెళ్లడానికి కాంగ్రెస్ నేతలకు అధికారం ఎక్కడదని బండి సంజయ్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 01:59 PM