హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Sep 19 , 2026 | 10:15 AM
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఈరోజు (శనివారం) భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించి డీసీఎంలో తరలిస్తున్న 425 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులపై కేసు నమోదు చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మిగతా వివరాలను పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి
ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News