ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 18 , 2026 | 10:44 AM
ప్రపంచం చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పెట్టుబడులు, వ్యాపారాలకే కాదని.. నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్, ఇన్నోవేషన్‌కు హైదరాబాద్ హబ్‌గా ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. పెట్టుబడులు, వ్యాపారాలకే కాదని.. నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్, ఇన్నోవేషన్‌కు హైదరాబాద్ హబ్‌గా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా సీఎం పోస్టు పెట్టారు. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ జరగనుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే UK బిజినెస్ స్కూల్స్, యూనివర్సిటీల ప్రతినిధులతో కీలక భేటీ అవుతామని తెలిపారు. MIT, Purdue, University of London, Virginia Tech, Northeasternతో భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతాయని వివరించారు.
ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, గ్లోబల్ కంపెనీలు, అత్యాధునిక పరిశోధనలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రీ – అకాడెమియా భాగస్వామ్యాలతో గ్లోబల్ టాలెంట్‌కు వేదికగా తెలంగాణ మారతుందని వివరించారు. ప్రపంచం వచ్చి నేర్చుకునే.. ఇన్నోవేట్ చేసే.. ఇన్వెస్ట్ చేసే రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని తెలిపారు. 2034 నాటికి $1 ట్రిలియన్.. 2047 నాటికి $3 ట్రిలియన్ సాధించడం తెలంగాణ టార్గెట్ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ భూమిని హరీశ్‌రావు కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది?: మంత్రి పొంగులేటి
అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: రాకేశ్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News