ఆ భూమిని హరీశ్‌రావు కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది?: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:21 AM
మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీశ్‌రావు భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. భూదాన్ భూమిని ఆయన కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావుపై (Harishrao) తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీశ్‌రావు భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. భూదాన్ భూమిని ఆయన కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మీడియాతో మంత్రి పొంగులేటి ఇవాళ (బుధవారం) చిట్‌చాట్ చేశారు.
22ఏ భూముల విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయి..
ప్రభుత్వ భూమిని ఏ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ చేసినా తప్పేనని మంత్రి చెప్పుకొచ్చారు. హరీశ్‌రావు బుద్ధి ఎక్కడ పోయింది? అని నిలదీశారు. 22ఏ కింద నాలుగు లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉందని.. మిగతాదంతా ప్రభుత్వ భూమేనని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంకా 40 వేల ఎకరాల భూమిని 22ఏ నుంచి తగ్గించామని స్పష్టం చేశారు. 22ఏ భూముల విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
తహసీల్దార్ కార్యాలయాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి..
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు ఈరోజు (బుధవారం) ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయాల గురించి సభలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు. చాలా చోట్ల తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.640 కోట్లతో కొత్త ఎమ్మార్వో భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాలను నిర్మించడం కోసం టెండర్లు పిలిచామని చెప్పుకొచ్చారు. అవసరమైన ప్రాంతాల్లో ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాలను నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో నిర్మాణంలోని కార్యాలయాన్ని త్వరగా నిర్మించి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి
వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News