Share News

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:43 PM

హైదరాబాద్‌ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్ షోర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని సీఎం తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో సింగపూర్ వాణిజ్య - పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎంతో వారు చర్చించారు.

CM-REVANTH-REDDY.jpg


మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం

తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు తెలిపారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు సీఎం వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు వివరించారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, రాత్రి వేళా.. రాబడి పెంచేలా (నైట్ ఎకానమీ) ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక పరమైన సహకారం అందించాలని సింగపూర్ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

CM-REVANTH-REDDY-1.jpg

CM-REVANTH-REDDY-4.jpg


పెట్టుబడులకు అన్నిరకాలుగా సహకరిస్తాం..

రాష్ట్రంలో పెట్టుబడులకు అన్నిరకాలుగా తమ ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడులపై సానుకూలంగా సింగపూర్ ప్రతినిధులు స్పందించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను ఫ్యూచర్ సిటీలో డిసెంబర్‌లో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్ - జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

CM-REVANTH-REDDY-3.jpg

CM-REVANTH-REDDY-2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి

వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 01:43 PM