Share News

అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: రాకేశ్ రెడ్డి

ABN , Publish Date - Sep 16 , 2026 | 10:34 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: రాకేశ్ రెడ్డి
BJP MLA Rakesh Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (BJP MLA Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ అభివృద్ధి విషయం గురించి సభలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎవరికి పట్టని జిల్లా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల జిల్లాలకు ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారని.. తమ నియోజకవర్గాలను పట్టించుకోకపోతే ఈ రోజే రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. చాలా ఏళ్లుగా ఆర్మూర్‌లో రెవెన్యూ కార్యాలయం కట్టాలని తాను కోరుతున్నానని.. అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.


దివ్యాంగుల హామీలను నెరవేర్చాలి: పాయల్ శంకర్

ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దివ్యాంగుల హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీల్లో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ హామీ రూ. 6016లకు పెంచాలని పట్టుబట్టారు. దివ్యాంగుల కోటాలోని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అడిగారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. రంగారెడ్డి పరిధిలోని ఆర్థోపెడిక్ సదనాలను హైదరాబాద్ పరిధిలోకి తరలించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని పాయల్ శంకర్ పట్టుబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి

వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 11:37 AM