Share News

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:05 PM

ఉప్పల మల్సూర్.. నాలుగుసార్లు సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా సొంతిల్లు లేని పరిస్థితి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా ఇప్పించండి అంటూ ఆ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈ కథనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరడంతో.. ఆయన వెంటనే స్పందించారు.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): ఉప్పల మల్సూర్.. నాలుగుసార్లు సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా సొంతిల్లు లేని పరిస్థితి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా ఇప్పించండి అంటూ ఆ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈ కథనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) దృష్టికి చేరడంతో.. ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇదే అంశంపై ఎక్స్‌వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.


సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ఏం పోస్ట్ చేశారంటే..

‘జీవితాంతం ప్రజల కోసమే పరితపించిన మాజీ శాసనసభ్యులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, దివంగత ఉప్పల మల్సూర్ కుటుంబం నేడు నిలువనీడ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలుసుకొని నా మనసు చలించిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం ప్రభుత్వ, దళితుల భూములను ఆక్రమించుకొని, ప్రజల సొమ్మును దోచుకుని ఫాంహౌస్‌లు నిర్మించుకుంది తప్ప పేదలకు ఇళ్లు నిర్మించలేదని చెప్పడానికి ఉప్పల మల్సూర్ కుటుంబ ధీనగాథే నిదర్శనం. ఈ రోజు పత్రికల్లో వచ్చిన కథనాన్ని చూసిన వెంటనే అధికారులను ఆదేశించి, ఉప్పల మల్సూర్ గారి కోడళ్లు ఉప్పల పుష్పలత, ఉప్పల యశోద గార్ల పేర్లపై రెండు ఇందిరమ్మ ఇళ్లను తక్షణమే మంజూరు చేయడం జరిగింది. ఇళ్ల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్రతులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ స్వయంగా ఉప్పల మల్సూర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ భూమిని హరీశ్‌రావు కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది?: మంత్రి పొంగులేటి

అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: రాకేశ్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 02:19 PM