Share News

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:39 AM

మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొని స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Medchal District Road Accident

మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొని స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. స్కూటీపై వెళ్తున్న యువతి దీప్సిక (19), యువకుడు అమర్దొయ (15)ను టిప్పర్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు.


వినాయక మండపం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 07:16 AM