Share News

భారత్‌, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలు తెలంగాణలో సృష్టిస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:10 PM

హైదరాబాద్‌లో గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలకు మరింత ఊపువస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మార్పు.. లక్ష్యబద్ధమైన తమ ప్రభుత్వ పాలన ఫలితమేనని పేర్కొన్నారు.

భారత్‌, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలు తెలంగాణలో సృష్టిస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలకు మరింత ఊపువస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణలో మార్పు.. లక్ష్యబద్ధమైన తమ ప్రభుత్వ పాలన ఫలితమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం పోస్టు పెట్టారు. నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సహా దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని వెల్లడించారు. లొరియల్, అమ్జెన్, ఎలిలిల్లీ, యూనిలీవర్‌ సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


ఈ ఏడాది హైదరాబాద్‌లో 100 కొత్త జీసీసీలే లక్ష్యం..

ఈ ఏడాది హైదరాబాద్‌లో 100 కొత్త జీసీసీ (GCC)లే లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. తాము నిర్ణయించిన షెడ్యూల్ కంటే ముందే జీసీసీల లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీతో ప్రపంచస్థాయి బిజినెస్ ఎకోసిస్టమ్ సాధ్యమని వివరించారు. గ్లోబల్ కంపెనీలు, స్థానిక ప్రతిభ కలిసేలా కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాపారాలకు హైదరాబాద్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు. భారత్‌, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలు తెలంగాణలో సృష్టిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 10:01 PM