Share News

22A భూముల వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:56 PM

తెలంగాణలో నెలకొన్న 22A భూముల వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

22A భూముల వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
NHRC

ఢిల్లీ, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నెలకొన్న 22A భూముల వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ధరణి నుంచి భూ భారతి పోర్టల్‌కు మార్పు సమయంలో లక్షలాది ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్ల స్థలాలు నిషేధిత జాబితా (22-A) లో చేరినట్లు ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదులు అందాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు, గెజిట్ నోటిఫికేషన్ లేకుండానే ఆస్తులను నిలిపివేయడంపై అడ్వకేట్ కరుపోతుల రేవంత్ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.


ఆస్తుల విక్రయాలు, తనఖా లావాదేవీలు నిలిచిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో మధ్యవర్తులకు, అవినీతికి పెద్దపీట వేస్తున్నారంటూ ఫిర్యాదులో కరుపోతుల రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై అత్యవసర విచారణ జరిపి, నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 09:05 PM